వీధి వీక్షణ కథనాలతో స్ఫూర్తిని పొందండి

జాంజిబార్ ఇమేజ్

జాంజిబార్

జాంజిబార్‌ను మ్యాప్‌లో చూపేందుకు టాంజానియా ప్రభుత్వంతో సంయుక్తంగా చొరవ చూపుతూ విశ్వసనీయ వీధి వీక్షణ ఫోటోగ్రాఫర్‌లు చేపట్టిన సామూహిక కార్యక్రమమైన జాంజిబార్ ప్రోజెక్ట్ గురించి "వరల్డ్ ట్రావెల్ ఇన్ 360 (WT360)" అనే ఉపన్యాసాన్ని చూడండి. ఆర్కిపెలాగో మ్యాపింగ్ కోసం క్షేత్ర స్థాయి పనులను ప్రారంభించేందుకు, వీధి వీక్షణ ఫోటోగ్రఫీ గురించి స్థానికులలో అవగాహన కలిగించి తమకు తాముగా ఆ ప్రాజెక్ట్‌ను కొనసాగించేలా ఆ కమ్యూనిటీకి స్థిరమైన మోడల్ నిర్మించడానికి ఫెడరికో డిబెట్టో, నికోలే ఓమ్లేచెంకో, క్రిస్ డూ ప్లెస్సీస్‌లు టాంజానియాకు ప్రయాణం చేశారు.

మయన్మార్ ఇమేజ్

మయన్మార్

ఫోటోగ్రాఫర్ నై లిన్ సెక్ అలాగే 3XVIVR ప్రొడక్షన్‌లకు చెందిన తన సహోద్యోగుల అద్భుతమైన పనితనాన్ని చూపే ఈ వీడియోతో మయన్మార్‌ను అన్వేషించండి. మయన్మార్‌ను వీధి వీక్షణ ద్వారా డిజిటైజ్ చేసి, ఆ దేశపు సాంస్కృతిక వారసత్వాన్ని 360లో సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటయిన తమ ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం 3XVIVR అత్యధిక సమయాన్ని కేటాయించి ఎంతగానో కృషి చేసింది.

చిత్రం జింబాబ్వే

జింబాబ్వే

జింబాబ్వేని వీధి వీక్షణతో మ్యాపింగ్ చేయడం గురించి టవాండా కన్హేమా చెబుతున్న తన కథనాన్ని చూడండి. టవాండా తను పుట్టి పెరిగిన హరారే మహానగరం, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రదేశంగా పేరొందిన విక్టోరియా జలాపాతాల వీధివీక్షణ చిత్రాలను Google Mapsలో అందించాలనే లక్ష్యంతో తన మాతృదేశం జింబాబ్వేకి వెళ్లారు. జింబాబ్వే చుట్టూ గల ఇతర ముఖ్యమైన లొకేషన్‌లను కూడా చేర్చేందుకు అతను తన ప్రోజెక్ట్‌ను ఇటీవల విస్తరించారు.

కెన్యా ఇమేజ్

కెన్యా

కెన్యాను మ్యాపింగ్ చేస్తున్న కొందరు లోకల్ గైడ్‌లు, వీధి వీక్షణ విశ్వసనీయ ఫోటోగ్రాఫర్‌లను కలవండి. కెన్యా అత్యద్భుతమైన అందాలను ప్రపంచం ఆస్వాదించడంలో సాయపడాలన్న వారి కోరిక, ఈ లక్ష్యాన్ని సాధించడానికి వీధి వీక్షణే అంతిమ సాధనంగా నేరుగా దాని వైపు నడిపించింది.

ఆర్మేనియా ఇమేజ్

ఆర్మేనియా

లాభాపేక్ష రహిత సంస్థ Armenia360 స్థాపకుల్లో ఒకరయిన జో హాకోబియాన్ చెప్పే విషయాలను వినండి. తన పూర్వీకులు నివసించిన ప్రాచీన ద్వీపాన్ని మ్యాప్ చేసేందుకు ఆయన బృందం చేసిన ప్రయాణం గురించి లండన్‌లో జరిగిన 2019 వీధి వీక్షణ ఉన్నత స్థాయి సమావేశంలో జో మాట్లాడారు. వీధి వీక్షణతో ఎవరైనా తమకు ముఖ్యమైన స్థలాలను మ్యాప్‌లో పెట్టేందుకు ఎలా సాధికారతను పొందవచ్చు అనే దాని గురించిన కథనం ఇది.

చిత్రం బెర్ముడా

బెర్ముడా

వీధి వీక్షణ ఇమేజరీని సేకరించేందుకు విశ్వసనీయమైన వీధి వీక్షణ ఏజెన్సీ మైల్స్ భాగస్వామ్యంను నియమించుకున్న మార్కెటింగ్ గమ్యస్థాన సంస్థ బెర్ముడా టూరిజం అథారిటీ గురించి మరింత తెలుసుకోండి. మైల్స్ భాగస్వామ్యం పర్యాటకులకు వర్చువల్‌గా బెర్ముడాను తమ ప్రణాళికా (లేదా daydream గురించి) ప్రయాణంగా అన్వేషించడానికి సహాయపడుతూనే, బెర్ముడా టూరిజం అథారిటీ, Google Mapsలో తమ ఆన్‌లైన్ ఉనికిని ఆప్టిమైజ్ చేసుకుని, లోకల్ బిజినెస్ అన్వేషణను పెంచుకోవడానికి సహాయపడింది.

చిత్రం టోంగా

టోంగా

గ్రిడ్ పసిఫిక్ స్థాపకులు, టానియా వోల్ఫ్‌గ్రామ్, వికుకి కింగీలు టాంగాలో తమ మ్యాపింగ్ ప్రయాణాన్ని డాక్యుమెంటేషన్ చేశారు. టాంగా అలాగే ఇతర పసిఫిక్ ద్వీపాల సంస్కృతిని ప్రచారం చేసేందుకు, వారు యావత్ ఆర్కిపెలాగోను మ్యాప్‌లో నిక్షిప్తం చేసి దానిని వీధి వీక్షణకు జోడించే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రారంభించారు. వారి మనోహరమైన కథనాన్ని ఇక్కడ చూడండి.