ఫోటోల మూలాధారాలు
వీధి వీక్షణ ఫోటోలు రెండు మూలాధారాల నుండి అందించబడతాయి, ఒకటి Google మరొకటి మా సహకారులు.
మా కంటెంట్
Google-స్వంత కంటెంట్ క్రెడిట్లు “వీధి వీక్షణ” లేదా “Google మ్యాప్స్.” మా చిత్రాలలో కనిపించే ముఖాలు మరియు లైసెన్స్ ప్లేట్లను మేము ఆటోమేటిక్‌గా అస్పష్టంగా చేస్తాము.
ఇతర సహకారుల నుండి కంటెంట్
వినియోగదారు అందించిన కంటెంట్‌లో క్లిక్ చేయగల/నొక్కగల ఖాతా పేరు ఉంటుంది, కొన్ని సందర్భాలలో ప్రొఫైల్ ఫోటో కూడా ఉంటుంది.
Google మీకు వీధి వీక్షణను ఎలా అందిస్తుంది
వీధి వీక్షణ చిత్రాలను షేర్ చేయడానికి, మా ఇంజనీరింగ్ బృందం తెర వెనుక గట్టిగా శ్రమిస్తోంది. వీధి వీక్షణను మీకు అందించడానికి మా బృందం చేస్తున్న శ్రమకు ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ ఉంది.
-
దశ 1
చిత్రాలను సేకరించడం
వీధి వీక్షణలో చూపడానికి ముందుగా మేము నిజంగా స్థానాల చుట్టూ డ్రైవ్ చేసి, ఫోటోలు తీయాలి. మేము వీలైనంత ఉత్తమమైన చిత్రాలను ఎప్పుడు మరియు ఎక్కడ సేకరించాలో గుర్తించేందుకు, విభిన్న ప్రాంతాల వాతావరణం మరియు జనాభా సాంద్రతతో సహా చాలా అంశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాము.
-
దశ 2
చిత్రాలను సమలేఖనం చేయడం
మ్యాప్‌లో ఒక్కో చిత్రాన్ని దాని భౌగోళిక స్థానానికి జత చేయడానికి, మేము కారు పైన ఉండే GPS, వేగం మరియు దిశను కొలిచే సెన్సార్ల నుండి సంకేతాలను కలుపుతాము. ఇది కారు యొక్క ఖచ్చితమైన మార్గాన్ని పునర్నిర్మించడానికి మరియు అవసరమైనట్లు చిత్రాలను తిప్పడానికి మరియు తిరిగి సమలేఖనం చేయడానికి మాకు సహాయపడుతుంది.
-
దశ 3
ఫోటోలను 360 ఫోటోలుగా మార్చడం
360 ఫోటోలలో అంతరాలను నివారించడం కోసం, సమీపంలో ఉన్న కెమెరాలు స్వల్పంగా అతివ్యాప్తి చెందేలా ఫోటోలు తీస్తాయి, ఆపై ఆ ఫోటోలన్నింటినీ మేము ‘జోడించి’ ఒక 360 డిగ్రీ చిత్రాన్ని రూపొందిస్తాము. ఆపై ‘అంతరాలు’ తగ్గించి, మృదువైన పరివర్తనలను సృష్టించడం కోసం మేము ఒక ప్రత్యేకమైన చిత్ర ప్రాసెసింగ్ అల్గారిథమ్‌లను వర్తింపజేస్తాము.
-
దశ 4
మీకు సరైన చిత్రం చూపబడుతుంది
తలాల నుండి కారు యొక్క మూడు లేజర్ కిరణాలు పరావర్తనం చెందే వేగం భవనం లేదా వస్తువు ఉన్న దూరాన్ని మాకు తెలుపుతుంది మరియు 3D నమూనాలు నిర్మించడానికి మాకు వీలు కల్పిస్తుంది. దూరంగా ఉన్న ప్రాంతానికి మీరు వెళ్లినప్పుడు, ఆ స్థానం కోసం మీకు చూపగల ఉత్తమమైన విశాలదృశ్యాన్ని 3D నమూనా నిర్ధారిస్తుంది.

మేము ఎక్కడికి వెళుతున్నాము
మీ అనుభవాన్ని మెరుగుపరచి, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడంలో మీకు సహాయపడటం కోసం అవసరమైన చిత్రాలను మీకు అందించడం కోసం మేము వీధి వీక్షణ కార్‌తో అనేక దేశాలలో పర్యటిస్తున్నాము. మేము తర్వాత పర్యటించబోయే లేదా కొండల్లో గుట్టల్లో ప్రయాణించబోయే దేశాల జాబితాని పరిశీలించండి.
ప్రాంతం | జిల్లా | సమయం |
---|---|---|
{[value.region]} | {[value.districts]} | {[value.datestart| date:'MM/yyyy']} - {[value.dateend| date:'MM/yyyy']} |
మా నియంత్రణలో లేని (వాతావరణం, రహదారి మూసివేతలు, మొ.) కారణాల వల్ల, మా కార్లు ఆగిపోవడం లేదా స్వల్ప మార్పులు జరగవచ్చు. జాబితాలో నిర్దిష్ట నగరాన్ని పేర్కొన్నప్పుడు, డ్రైవింగ్ దూరపు పరిథిలో ఉన్న చిన్న నగరాలు మరియు పట్టణాలు కూడా చేర్చబడతాయని దయచేసి గుర్తుంచుకోండి.
మేము ఎక్కడికి వెళ్లాము
వీధి వీక్షణ అందుబాటులో ఉన్న ప్రాంతాలు మ్యాప్‌లో నీలి రంగులో ఉన్నాయి. మరింత వివరంగా చూడటం కోసం దగ్గరకు జూమ్ చేయండి లేదా మా వెబ్సైట్లు మరియు యాప్‌లతో ఈ కంటెంట్‌ని బ్రౌజ్ చేయండి.
Google యొక్క స్వంత వీధి వీక్షణ దళం
మా వీధి వీక్షణ దళాన్ని బ్రౌజ్ చేయండి.
-
వీధి వీక్షణ కారు
2007లో U.Sలో ప్రారంభించిన తర్వాత మేము చాలా పురోగతిని సాధించాము; నేడు మేము మా 360 ఫోటోలను మొత్తం ఏడు ఖండాలలోని స్థానాలకు విస్తరించాము.
-
వీధి వీక్షణ ట్రెక్కర్
ప్రపంచవ్యాప్తంగా కారు, ట్రైక్, ట్రాలీ లేదా స్నోమొబైల్ యాక్సెస్ చేయలేని మరిన్ని స్థలాలను ఫీచర్ చేయడానికి వీధి వీక్షణకు ట్రెక్కర్ సహాయపడుతుంది. ఈ ధరింపదగిన బ్యాక్‌ప్యాక్ ఎగువన ఒక కెమెరా బిగించబడి ఉంటుంది మరియు దీని సౌకర్యవంతమైన రూపం కాలి నడక మాత్రమే సాధ్యమయ్యే గట్టి, ఇరుకైన ప్రదేశాల గుండా వెళ్తున్నప్పుడు మనం చిత్రాలను సేకరించడానికి అనువుగా ఉంటుంది. ఈ కెమెరా సాంకేతికత ఉపయోగించి మా మొదటి సేకరణ అరిజోనా గ్రాండ్ కాన్యాన్ యొక్క ఎగుడు దిగుడుగా ఉన్న భూభాగం నుండి సేకరించబడింది.
-
వీధి వీక్షణ ట్రాలీ
కళను-ప్రేమించే కొంతమంది Google ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో వీధి వీక్షణ సాంకేతికతను ఉపయోగించాలనుకున్నప్పుడు, మ్యూజియంల ద్వారాల గుండా మరియు శిల్పాల చుట్టూ నావిగేట్ చేయడానికి సులువుగా సరిపోయే ఒక సిస్టమ్‌ని అభివృద్ధి చేయవలసిన అవసరం మాకు ఏర్పడింది. ఈ మొదటి ఫోరే ఇండోర్లలోకి అవసరమైన పరికరాలు అన్నీఒక చిన్న ఫ్రేమ్‌లోకి సరిపోయేవి: ఒక కెమెరా సిస్టమ్ బిగించిన ఒక తోపుడు బండిని ట్రాలీకి బిగించారు. ఇది మ్యూజియంల లోపలి ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా, వైట్ హౌస్ మరియు క్రీడల స్టేడియం వంటి ఇండోర్ స్థానాల నుండి కూడా వీక్షణలను సేకరించింది.
-
వీధి వీక్షణ స్నోమొబైల్
వీధి వీక్షణ కెమెరాలతో వాలుగా ఉండే ప్రాంతాల్లోని చిత్రాలను సేకరించడం మరింత సరదాగా ఉంటుందని మేము భావించాము. కొన్ని వారాంతాల్లో కొన్ని2x4లు, డక్ట్ టేప్ మరియు గడ్డ కట్టే పరిస్థితులను తట్టుకునే విధంగా స్కీ జాకెట్ల్లో చుట్టిన అదనపు హార్డ్ డ్రైవ్‌లను ఉపయోగించి, మా బృందం ఒక స్నోమొబైల్పై వీధి వీక్షణ పరికరాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసింది. స్కీయర్లు, స్నోబోర్డర్లు మరియు స్నోషూయర్లు ఇప్పుడు విస్లర్ బ్లాక్కాంబ్ పర్వతం మరియు పరిసరాలలోని రిసార్ట్‌ల చుట్టూ ఉన్న ఎత్తయిన, మంచుతో కూడిన భూభాగాన్ని అన్వేషించగలరు.
-
వీధి వీక్షణ మూడు చక్రాల వాహనం
చిన్న వీధులున్న నగరాల కోసం వీధి వీక్షణ ట్రెక్కర్‌ను అమర్చడానికి వీలైన వాహనం గురించి ఆలోచించవలసి వచ్చింది. కొన్ని ఇరుకైన సందుల్లోకి వెళ్లడానికి, మా బృందం ఇండోనేషియాలో సెలిస్ రాబిన్ మోటార్ సైకిల్ ఉత్తమమైన పరిష్కారం అని కనుగొంది. వీధి వీక్షణ మూడు చక్రాల వాహనాన్ని చూడండి. వీధి వీక్షణ ట్రెక్కర్ని ఇంకా ఎక్కువ స్థిరంగా ఉంచడానికి ఈ వాహనానికి అదనంగా లోహపు కడ్డీ ఏర్పాటు చేయబడింది.