Street View 15 సంవత్సరాల వేడుకలు
360-డిగ్రీల ప్రపంచ మ్యాప్‌ను క్రియేట్ చేయాలన్న అసాధారణమైన ఐడియాతో 2007లో Street View ప్రారంభమైంది. అప్పటి నుండి, మేము 100 దేశాలు, భూభాగాల్లో కలిపి 22 వేల కోట్లకు పైగా ఇమేజ్‌లను, 1 కోటి మైళ్లకు పైగా దూరాలను క్యాప్చర్ చేశాము.
ఈ ప్రయాణంలో మీరు అంతరిక్షం, సముద్రం, అలాగే వాటి మధ్యలో ఉన్న అద్భుతమైన ప్రదేశాలను అన్వేషించారు, యథావిధిగా మీరు ఎల్లప్పుడూ మీ ఇంటికి వెళ్లే మార్గాన్ని కనుగొన్నారు.
ప్రసిద్ధి చెందిన Street View లొకేషన్లను అన్వేషించండి
-
గ్రీన్‌ల్యాండ్‌లో ఐస్ఫోర్డ్తో పాటు ప్రయాణించండి
-
ఒక ప్రొఫెషనల్ క్లయింబర్తో కలిసి యో సెమిటిలో ఉన్న ఎల్ క్యాపిటాన్ పర్వతాన్ని ఎక్కండి
-
ఈఫిల్ టవర్ పైనుండి అందమైన ప్యారిస్ స్కైలైన్‌ను ఆస్వాదించండి
-
అబ్బురపరిచే షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును చూడండి
-
ప్రపంచంలోని ఏకైక ఎగరలేని చిలుకను న్యూజిలాండ్‌లో చూడవచ్చు
-
మాచు పీచు పురాతన దేవాలయాలను అన్వేషించండి
Street Viewలో కొత్తగా ఏముంది?
ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది: సమయం ద్వారా ప్రయాణం
కాలక్రమేణా స్థలాలు ఎలా మారతాయి అన్నది ఇప్పుడు మీరు Google Maps యాప్‌లో Street View హిస్టారికల్ ఇమేజరీ ద్వారా చూడవచ్చు.
Google Maps యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి
మాకు నచ్చిన 15 దృశ్యాలు
మంగోలియన్ ఐస్ ఫెస్టివల్‌తో మొదలుపెట్టి టిటికాకా సరస్సులో తేలియాడే గృహాల దాకా, మన భూమిపై ఉండే అత్యంత ఉత్కంఠభరితమైన దృశ్యాలలో కొన్నింటిని చూడండి.